ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. అలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఇకపోతే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉండడంతో ఆయనకు మద్దతుగా హైపర్ ఆది కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసేన కు మద్దతుగా ప్రచారాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా హైపర్ ఆది మాట్లాడుతూ ... నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశాను. కాకపోతే ఒక్క చోటే ఉండి పని చేయడం నాకు ఏ మాత్రం నచ్చదు. నాకు ఆ ఉద్యోగం చేయాలి అని అనిపించేది కూడా కాదు. కాకపోతే కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. నా చదువు కోసం మా తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేశారు. అలా అప్పులు తీర్చడం కోసం కొంత కాలం పని చేశా. నా వల్ల కాలేదు. చివరికి ఒక రోజు నేను ఉద్యోగం మానేస్తా అని మా తల్లిదండ్రులకు చెప్పాను.

అప్పులు బాగా ఉన్నాయి... అందుకోసమని మూడు ఎకరాల భూమి అన్ని వాటిని కట్టండి అని చెప్పాను. కానీ వారు మొదట నా మాట వినలేదు. ఆ తర్వాత నేను ఉద్యోగం మానేశాను. వారు కూడా మూడు ఎకరాల భూమి అమ్మి అప్పులు అన్నీ కట్టారు. అలాంటి సమయంలో నేను జబర్దస్త్ పై కాన్సన్ట్రేషన్ పెట్టాను. అందులో సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత అంతకు రెండింతల భూమి కొన్నాను అని హైపర్ ఆది తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: