టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలయ్య ఈ మధ్యకాలంలో వరుస విజయాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ హీరో గా నటించాడు. శృతి హాసన్ , హనీ రోజ్ ఈ మూవీ లో బాలయ్య సరసన హీరోయిన్ లుగా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ లో శృతి హాసన్ తన నటనతో పెద్దగా అలరించలేదు కానీ తన అందాలతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా శృతి హాసన్ కు గొప్ప పేరు రాకపోయినప్పటికీ ఒక విజయం మాత్రం దక్కింది. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కాకుండా మరొక బ్యూటీ ని అనుకున్నారట. ఆమె ఈ సినిమాలో నటించను అని చెప్పడంతో ఈ ఆఫర్ శృతి హాసన్ కు వచ్చిందట. ఆ వివరాలు తెలుసుకుందాం. వీర సింహా రెడ్డి మూవీ సెట్ అయిన తర్వాత ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఇందులో బాలయ్య కు జోడీగా తమన్నా ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారట.

అందులో భాగంగా ఈమెకు కథను కూడా వివరించారట. ఈ సినిమా స్టోరీ మొత్తం విన్న తమన్నా ఈ సినిమాలో నటించను అని చెప్పిందట. దానితో ఈ మూవీ యూనిట్ శృతి హాసన్ ను సంప్రదించడం , ఆమె ఈ సినిమా కథ మొత్తం విని ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంట. అలా వీర సింహా రెడ్డి మూవీ లో తమన్నా ప్లేస్ లో శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: