ఒక వైపు నామినేషన్లు నడుస్తున్న మరోవైపు కూటమి మాత్రం సీట్ల పంపకం విషయంలో బిజీగానే ఉంది. ఇక ఇప్పటికే చాలా సీట్ల విషయంలో కూటమి ఓ క్లారిటీకి వచ్చినప్పటికీ వనపర్తి సీటు విషయంలో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొనే ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత వనపర్తి సీటును బీజేపీ కి కేటాయించారు. దానితో బీజేపీ నాయకత్వం ఈ ప్రాంత సీటును శివరామకృష్ణ రాజుకు ఇచ్చింది. ఆయన కూడా ఆ ప్రాంతంలో ప్రచారాలను మొదలు పెట్టాడు.

కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యింది. ఈ ప్రాంత టీడీపీ అభ్యర్థి అయినటువంటి నల్లమిల్లి రామృకృష్ణారెడ్డి సీట్ కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఇక చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురందరేశ్వరి కూడా ఈ ప్రాంతంలో శివ రామ కృష్ణం రాజును తప్పించి ఆ సీట్ ను నల్లమిల్లి రామృకృష్ణారెడ్డి కి ఇవ్వాలి అని కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది.

తాజాగా ఈమె రామకృష్ణారెడ్డి తో అనేక మంతనాలు చేసి ఈయన పోటీ నుండి తప్పుకునేలా చేసినట్లు తెలుస్తోంది. దానితో శివ రామ కృష్ణం రాజు ను బీజేపీ లోకి చేర్చుకొని ఆయనను వనపర్తి నుండి పోటీ చేసే విధంగా బీజేపీ నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మొదట శివ రామ కృష్ణం రాజు బీజేపీ నుండి కాకుండా తెలుగుదేశం నుండి మాత్రమే పోటీ చేస్తాను అని చెప్పారట. 

కాకపోతే ఇప్పటికే సీట్ల పంపిణీ పూర్తి కావడంతో ఆయనను కచ్చితంగా కూటమిలో భాగంగా బీజేపీ నుండే పోటీ చేయమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పడంతో ఆయన సరే అన్నట్లు తెలుస్తోంది. కాకపోతే బీజేపీ క్యాండిడేట్ గా  కాకుండా కూటమి అభ్యర్థి లాగానే ఎన్నికల్లో దిగాలి అనే ఉద్దేశంలో ఈయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ ఒక వైపు నామినేషన్ల పర్వం నడుస్తున్న వేళ కూటమి మాత్రం సీట్ల పంపిణీ విషయంలోనే తర్జనభర్జన పడుతుంది. మొదట కూటమికి మైలేజ్ వచ్చినా కూడా సీట్ల పంపిణీ ప్రారంభం అయినప్పటి నుండే దీని మైలేజ్ తగ్గుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: