టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరుపొందిన హీరో తిరువిర్ మసూద సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఈ సినిమా హర్రర్ సినిమాగా బెస్ట్ మూవీ గా నిలిచింది. ఆ తర్వాత పరేషాన్ అనే సినిమాతో హీరోగా కూడా నటించి బాగానే పాపులారిటీ అందుకున్నారు. ఈ నటుడు స్వస్థలం రంగారెడ్డి జిల్లా.. ఇండస్ట్రీలోకి రాకముందే దాదాపుగా 150 కి పైగా నాటకాలలో నటించారు. అలా ఇండస్ట్రీలోకి రావడానికి ఇష్టపడ్డారు. అలాగే రేడియో జాకిగా కూడా పనిచేశారు. మొదట బొమ్మల రామారం అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత రానా ఘాజి, ఏ మంత్రం వేసావే,టజ్ జగదీష్ జార్జి రెడ్డి తదితర చిత్రాలలో నటించారు. పలాస సినిమాలో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ తో మంచి క్రేజీ సంపాదించుకున్నారు తిరువిర్.. మసూద సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే తిరువీర్ ఓ ఇంటివాడు అయినట్లుగా తెలుస్తోంది. తన ప్రేయసి కల్పనా రావును వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాహం కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలోనే నిన్నటి రోజున చాలా గ్రాండ్గా శ్రీవారి ఆలయంలో ఈ హీరో వివాహం జరిగింది.


అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు తిరువీర్. దీంతో అభిమానులు సిని సెలబ్రిటీలు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే తిరువిర్  చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో కూడా కీలకమైన పాత్రలో నటించారు. తిరువీర్ నటిస్తున్న మోక్ష పట్నం, పారా హుషారు వంటి చిత్రాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఇటీవలె ఒక విభిన్నమైన కథ అయినటువంటి సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా నటించబోతున్నారు తిరువీర్.. ప్రస్తుతం తిరువీర్ పెళ్లికి  సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: