మంజూషకి యువతని ఆకట్టుకునే గ్లామర్ ఉన్నప్పటికీ మిగిలిన యాంకర్స్ లాగా ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. ఆమె కెరీర్ లో ఎప్పటికి గుర్తుంచుకోద్దగ్గ చిత్రం అంటే ఎన్టీఆర్ రాఖీ మాత్రమే.యంగ్ టాలీవుడ్ లో ఉన్న అందమైన యాంకర్ లో మంజూష ఒకరు. అనసూయ, శ్యామల, రష్మీ లాగే మంజూష కూడా బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర సినిమా కార్యక్రమాల్లో కూడా మంజూష కనిపిస్తూ ఉంటుంది. సొట్ట బుగ్గల సొగసు ఆమెకి అడ్వాంటేజ్.అయితే మంజూషకి యువతని ఆకట్టుకునే గ్లామర్ ఉన్నప్పటికీ మిగిలిన యాంకర్స్ లాగా ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. ఆమె కెరీర్ లో ఎప్పటికి గుర్తుంచుకోద్దగ్గ చిత్రం అంటే ఎన్టీఆర్ రాఖీ మాత్రమే. దాదాపు 18 ఏళ్ళ క్రితం మంజూష ఈ చిత్రంలో ఎన్టీఆర్ చెల్లి పాత్రలో నటించింది.కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే సిస్టర్ సెంటిమెంట్ తో ఉంటుంది. అది అదృష్టమనే చెప్పాలి. అంత గొప్ప పాత్రలో నటించి కూడా మంజూష ఆ తర్వాత మంచి సినిమాలు చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నటనకి పూర్తిగా దూరమైంది. దీని గురించి మంజూష ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.

 రాఖీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అవి గొప్ప చిత్రాలేమీ కాదు. ఆ చిత్రాల్లో తాను నటించినట్లు కూడా చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కావడంతో కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేయాల్సి వచ్చింది అని మంజూష ఓపెన్ గా తెలిపింది. మంచి పాత్రలు రాకపోవడం వల్లే సినిమాలు చేయలేకపోయాను అని మంజూష క్లారిటీ ఇచ్చింది.ఇక యాంకర్ గా డిఫెరెంట్ షోలు చేయాలని తనకి కోరిక అట. ఒక టైంలో మంజూష జబర్దస్త్ కి యాంకరింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. జబర్దస్త్ లాంటి షోలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. కానీ తాను యాంకరింగ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ వార్తలన్నీ హైపర్ ఆదితో చేసిన స్కిట్ వల్లే వచ్చాయి.తాను చేయబోయే స్కిట్ లో గెస్ట్ రోల్ చేయాలి అని హైపర్ ఆది అడిగాడు. డిఫెరెంట్ ఎక్సపీరియన్స్ ఉంటుంది.. జబర్దస్త్ కూడా ఎలా ఉంటుందో నాకూ తెలుస్తుంది కదా అని ఆ స్కిట్ చేశా. నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్కిట్ చేయడంతో జబర్దస్త్ కి నెక్స్ట్ యాంకర్ నేనే అని రూమర్స్ వచ్చినట్లు మంజూష క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: