టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో క్యూట్ కపుల్ గా సూర్య, జ్యోతికలకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఈ జోడీకి పెళ్లై 18 సంవత్సరాలు కాగా సోషల్ మీడియాలో సైతం ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే సూర్య జ్యోతిక పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కొడుకు దేవ్ సాధించిన అరుదైన ఘనత వాళ్ల సంతోషానికి కారణమని చెప్పవచ్చు. సూర్య కొడుకు దేవ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.కొడుకు బ్లాక్ బెల్ట్ అందుకునే కార్యక్రమానికి సూర్య సైతం హాజరు కావడం గమనార్హం. సూర్య ఈ కార్యక్రమంలో తన కొడుకుతో పాటు బ్లాక్ బెల్ట్ సాధించిన ఇతర విద్యార్థులను సైతం ప్రశంసించి గొప్ప మనస్సును చాటుకున్నారు. కొడుకు సక్సెస్ చూసి సూర్య ఎంతలా సంతోషించారో ఆయన కళ్లు చూస్తే అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సూర్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

కొడుకు పేరు దేవ్ కాగా కూతురు పేరు దియా  అనే సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతిక కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని త్వరలో ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. సూర్య కెరీర్ విషయానికి వస్తే కంగువ సినిమాతో ఈ హీరో బిజీగా ఉండగా ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.బింబిసార తరహా కాన్సెప్ట్ తో కంగువ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కంగువ దసరా టార్గెట్ గా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య కెరీర్ పరంగా కూడా భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కంగువ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: