మెగా అనే ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మెగా హీరోలుగా వచ్చి తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఎప్పుడు డిఫరెన్స్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు వరుణ్. తేజ్ ఇక వరుణ్ ఏదైనా సినిమా చేశాడంటే కథ బలంగా ఉంటుందని అభిమానులు నమ్ముతూ ఉంటారు. అంతలా తన సినిమాలతో అందరిని ప్రభావితం చేశాడు.


 అయితే ఈ మెగా హీరో ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో సీక్రెట్ లవ్ రిలేషన్షిప్ కొనసాగించిన వరుణ్ తేజ్ ఇటీవల తమ ప్రేమ విషయం ఎంతో చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే ఇంకోవైపు భార్య లావణ్యతో ట్రిప్పులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే వరుణ్ తేజ్ తీసుకున్న ఒక నిర్ణయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వరుణ్ తేజ్ నిర్ణయంతో మెగా ఫ్యామిలీలో గొడవ మొదలవబోతుందా  అనే విషయం గురించి చర్చించుకుంటున్నారు అందరూ.


 ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఇంకోవైపు సొంతంగా బ్యానర్లు పెడుతున్నారు. ఇలా నటనలో నిర్మాణరంగంలో బిజీగా ఉంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి కూడా కొనిదెల ప్రొడక్షన్స్ ఉంది.  మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొత్తగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసింది. అయితే ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఇలాగే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నాడట. భార్య లావణ్యతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలుస్తుంది. దీంతో ఒకే ఫ్యామిలీలో రెండు బ్యానేర్స్ అంటే ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరిగాయా.. లేకపోతే ఇంకేదైనా విషయం ఉందా అనేది సోషల్ మీడియాలో చర్చిని అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: