సూపర్ స్టార్ రజిని పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి జైలర్ అనే మూవీ తో పవర్ఫుల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి తమిళ సినీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత రజిని తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. జైలర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత రజనీ కీలకపాత్రలో నటించిన మూవీ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాను రజిని స్టార్ స్టామినా కూడా నిలబెట్టలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రజిని కొంత కాలం క్రితమే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ మూవీ ని ఓకే చేసిన విషయం మనకి తెలిసిందే. ఈ మూవీ కి మొదట టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా రజనీ కెరీర్ లో 171 వ మూవీ కావడంతో "తలైవార్ 171" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని అనౌన్స్ చేశారు. ఇక నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక వీడియోను విడుదల చేస్తూ ఈ మూవీ టైటిల్ ను కూడా ప్రకటించింది.

ఈ సినిమాకు మూవీ యూనిట్ "కూలీ" అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఇక నిన్న ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. జైలర్ మూవీ తర్వాత రజిని హీరోగా నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: