మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. చిరు, త్రిష కాంబోలో చాలా సంవత్సరాల క్రితం స్టాలిన్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే వీరి జంటకు కూడా మంచి ప్రశంసలు ఆ సమయంలో దక్కాయి. చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి జంటలో రూపొందుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా ఈ జంట ఈ సారి వెండి తెరపై ఏ రేంజ్ లో అలరిస్తుందా అని ఎంతో వెయిట్ చేస్తున్నారు.

మూవీ ని యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తూ ఉండగా , ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాన్ని పూర్తి చేసింది. అందుకు సంబంధించిన క్రేజీ వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ సన్నివేశాన్ని 26 రోజుల పాటు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో అనేక నటీనటులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ ఇంటర్వెల్ సన్నివేశాల కోసం ఏకంగా 54 ఫీట్ల పొడవైన హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ షెడ్యూల్ ను తాజాగా ఈ మూవీ బృందం చిత్రీకరించినట్లు, అలాగే ఈ ఇంటర్వెల్ సన్నివేశం కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం బింబిసారా లాంటి విజయవంతమైన మూవీ తర్వాత వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: