విశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బాలీవుడ్ సినిమాల ద్వారా రెండు తెరకు పరిచయం అయింది. కొంత కాలం క్రితం అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ మూవీ పృథ్వీరాజ్ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఇక దానితో ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగానే కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

తాజాగా ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ లో వరుణ్ తేజ్ కు జోడిగా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తాను మిస్ చేసుకున్న ఓ బ్లాక్ బస్టర్ మూవీ గురించి చెప్పుకొచ్చింది.

 సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ... షహీద్ కపూర్ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ అయినటువంటి కబీర్ సింగ్ లో ప్రీతి చేసిన పాత్రకు తోలత ఆ మూవీ యూనిట్ నన్నే సంప్రదించింది. కాకపోతే అందులో షాహిద్ కపూర్ హీరో అని తెలియక నేను ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాను అని తాజాగా ఈ బ్యూటీ వివరించింది. ఇక కబీర్ సింగ్ మూవీ లో ప్రీతి పాత్రలో నటించిన కియార అద్వానీ ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: