యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో వచ్చిన గుర్తింపును మరింత పెంచుకునే విధంగానే తన తదుపరి ప్రాజెక్టు లను సెట్ చేసుకుంటూ ఈ నటుడు వెళుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకోవాల్సింది. కాకపోతే అంతలోనే ఎన్టీఆర్ నటిస్తున్న "వార్ 2" సినిమా షూటింగ్ కూడా ఒక వైపు నడుస్తూ ఉండగా ఆయన ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ ఉండడంతో దేవర మూవీ మొదటి భాగం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ "వార్ 2" మూవీ కి సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ కి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

దానితో మే మొదటి వారం నుండి దేవర మూవీ యొక్క షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు మే రెండవ వారం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ హాలీ ఖాన్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు ఈ షెడ్యూల్ చాలా రోజుల పాటు జరగనున్నట్లు ఈ షెడ్యూల్ తో దేవర మూవీ మొదటి భాగం కు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా పరీక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: