బాలయ్య , బోయపాటి కాంబోలో రూపొందిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో బాలకృష్ణ రైతు గాను , అఘోర గాను రెండు డిఫరెంట్ పాత్రలలో నటించి రెండింటి లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అల్లరించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా , శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇతను అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.

 ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ మూవీ బృందంలోని చాలా మంది ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను "అఖండ" మూవీ కి కొనసాగింపుగా "అఖండ 2" ఉండబోతుంది అని , ఇప్పటికే అందుకు సంబంధించిన కథ కూడా కంప్లీట్ అయింది అని , ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ పాలల్లో బిజీగా ఉన్నట్లు అవి పూర్తి కాగానే "అఖండ 2" సినిమా సెక్స్ పైకి వెళ్ళనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

అలాగే ఈ సినిమా దేవాలయాల గురించి వాటిని పరిరక్షణ గురించి ఉంటుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే బాలయ్య , బోయపాటి కాంబోలో సింహ , లెజెండ్ , అఖండ అనే మూడు మూవీ లు రూపొంది మూడు కూడా బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి. దానితో "అఖండ 2" పై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: