మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మరో కొంత కాలంలోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇందులో మొదట ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న కొంత మంది పై ఈ చిత్ర బృందం సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు అవి పూర్తి కాగానే చరణ్ పై ఒక అదిరిపోయే సాంగ్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ ఈ సినిమాలో చరణ్ రెండవ క్యారెక్టర్ కు సంబంధించిన పూర్తి క్యారెక్టర్ ను రివిల్ చేసే విధంగా ఉండబోతున్నట్లు , ఈ సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను కూడా ఈ మూవీ యూనిట్ అమ్మి వేస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను ఇప్పటికే ఏ ఏ సినిమా సంస్థపై అనిల్ తాడని దక్కించుకున్నట్లు ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: