టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ రామ్ పోతినేని చేస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగింది. దీనికి రామ్ కారణం అనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం తెలుస్తోంది. కేవలం ఆర్ధిక సమస్యల వల్లే కొద్ది రోజులు మూవీ షూటింగ్ వాయిదా వేశారంట. ఈ సినిమా కోసం రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ లో షేర్ తీసుకొని చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా అడ్వాన్స్ తీసుకొని చేయాలని అనుకున్న కూడా తరువాత నిర్ణయం మార్చుకొని ప్రాఫిట్ షేర్ కి రామ్ ఒకే చెప్పాడు. దీంతో మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే లైగర్ సినిమా ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడినట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా పూరి జగన్నాథ్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంపై ఫోకస్ చేశాడని సమాచారం తెలుస్తోంది.


బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్ కూడా డబుల్ ఇస్మార్ట్ కథ కోసం కాస్తా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకొచ్చి సరికొత్తగా ఈ కథని ఆవిష్కరించే ప్రయత్నం పూరి చేస్తున్నారు. ఈ మూవీతో పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ కావడంతో పాటు ఇస్మార్ట్ రామ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో బాగా వినిపిస్తోంది. హీరో రామ్ పోతినేని కూడా ఈ సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ క్యారెక్టర్ ఎంత బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ చూసారు. ఇప్పుడు డబుల్ మైండ్ తో డబుల్ ఇస్మార్ట్ అంతకుమించి అనేలా ఉంటుందని సమాచారం. ఇక మూవీని ఈ ఏడాది శివరాత్రి టైమ్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో జూన్ 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని మే ఫస్ట్ వీక్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారాట.

మరింత సమాచారం తెలుసుకోండి: