తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నారా రోహిత్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రతినిధి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.  శుభ్ర అయ్యప్ప , శ్రీవిష్ణు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా... ప్రతాప్ మండల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 2014 వ సంవత్సరం విడుదల అయిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆ టైం లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది.  ప్రతినిధి మూవీ మంచి విజయం సాధించడంతో నారా రోహిత్ తాజాగా "ప్రతినిధి 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. 

ఈ సినిమాకి మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా కొన్ని రోజుల నుండి ఈ మూవీ యూనిట్ చేస్తుంది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ సినిమా బృందం ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ ను ప్రకటించింది.

తాజాగా ప్రతినిధి 2 మూవీ యూనిట్ ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని , మరో కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ప్రతినిధి సినిమా మంచి సక్సెస్ అయ్యి ఉండడం , అలాగే "ప్రతినిధి 2" ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మరికొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nr