నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ ని "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. 

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఒక వీడియోను విడుదల ఈ మూవీ యూనిట్ చేయగా అది అద్భుతమైన రేంజ్ లో ఉండడం, అందులో బాలయ్య తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ వీడియో తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే గత కొంత కాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయినటువంటి బాబి డియోల్  ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ దర్శకుడు బాబి అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్న సూర్య దేవర నాగ వంశీ , బాబి డియోల్ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను ఈ చిత్ర బృందం వారు బయటకు వదిలారు. దీనితో ఈ మూవీ లో బాబీ  డియోల్ నటిస్తున్నట్లు తెలిసిపోయింది. మరి ఈయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడా..? లేక మరేదైనా ఇతర పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాలి అంటే.చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మూవీ లో బాలయ్య సరసన ఇద్దరూ బ్యూటీలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఊర్వశి రౌటేలా ను ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇంకో హీరోయిన్ గా ఎవరిని ఈ మూవీ యూనిట్ సెలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: