రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

దానితో ప్రస్తుతం హను రాఘవపూడి ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హీరోయిన్ ని వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకి హీరోయిన్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ ని హను రాఘవపూడి , ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు ఇప్పటికే ఈమెతో సంప్రదింపులు జరపగా జాన్వి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిపోయే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది.

ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: