రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ మూవీ రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే చాలా రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందు ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే సలార్ మొదటి భాగంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

ఈమె పాత్రకి ఈ సినిమాలో పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో ఈమె బాగానే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సలార్ రెండవ భాగంలో శృతి హాసన్ తో పాటు మరో ముద్దు గుమ్మ కూడా హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తను బట్టి చూస్తే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి కియార అద్వానీ ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు రెండవ భాగం లో సెకండ్ హాఫ్ లో ఈమె సన్నివేశాలు ఉండనున్నట్లు అలాగే ఈ సినిమాలో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

మరి ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: