టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేశ్  హీరోగా వస్తున్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ జాతి రత్నాలు సినిమాతో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ వేడుకలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు.తన కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. ప్రస్తుతం పార్ట్ 2 కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు అల్లరి నరేష్ తెలిపాడు. ఇక సుడిగాడు సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమా కేవలం 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.


స్పూఫ్, కామెడీ సన్నివేశాలతో 2012లో వచ్చిన ఈ సినిమా.. అందరినీ ఆకట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. అప్పట్లో సుడిగాడు సినిమాను రూ.7 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.32 కోట్లు వసూలు రావడం మామూలు విషయం కాదు. కామెడీ హీరోగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లరి నరేష్.. కొన్నాళ్ల నుంచి స్లో అయ్యాడు. ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లి పోతున్నాడు. ‘నాంది’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  ‘ఉగ్రం’ వంటి సినిమాల్లో చాలా సీరియస్ రోల్స్ పోషించాడు అల్లరి నరేష్.అయితే అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్  ‘సుడిగాడు’  ‘తమిజ్ పదమ్’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. పేరుకు తమిళ సినిమా రీమేక్ అయ్యుండొచ్చు కానీ.. ఇందులో వంద సినిమాలని స్పూఫ్ చేశారు.ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న సుడిగాడు 2 సినిమా కూడా భారీ హిట్ కొట్టి ఆ రేంజ్ వసూళ్ళని సాధిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: