తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. పోకిరి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకి వరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న దాదాపుగా అందరూ స్టార్ హీరోలు సరసన నటించింది. ఈ నేపథ్యంలోనే కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా టాలీవుడ్ ని విడిచి వెళ్లడంతో ఇలియానా కెరియర్ డౌన్ అయిపోయింది.

ఇకపోతే ఇలియానా కంటే ముందు వచ్చిన త్రిష శ్రేయా వంటి స్టార్ హీరోయిన్లు ఎప్పటికీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ ఇలియానా మాత్రం టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లడంతో టాలీవుడ్ లో తన క్రేజ్ మొత్తం పడిపోయింది. అంతేకాదు అప్పట్లో ఇలియానాకి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు  టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసాయి. బ్రేకప్ ల వల్ల ఎంతో కృంగిపోయిన ఇలియానా ఒక ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ని ప్రేమించింది కొంతకాలం కలిసే ఉన్నప్పటికీ ఇద్దరికీ బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఇలియానా తిరిగి కోలుకొని మరొక వ్యక్తిని ప్రేమించి ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం తన భర్త కొడుకుతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం కొడుకు, భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్

కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలియానా అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఇలియానా నటించిన లేటెస్ట్ మూవీ దో ఔర్ దో ప్యార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం తన కొడుకు భర్తతో సంతోషంగా ఉన్న ఇలియానా మానసికంగా అలసిపోయాను అంటూ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. మరి ఈ సమయంలో ఇలియానా ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఒక పెద్ద మాట అనడానికి అంత పెద్ద సమస్య ఇలియానాకి ఏమొచ్చింది అంటూ ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: