ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా , సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా , అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ఇక ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే టీజర్ ను విడుదల చేసింది.

ఇక నిన్న ఈ మూవీ యూనిట్ ఏ సినిమాల్లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "పుష్ప పుష్ప పుష్ప పుష్ప" అంటూ సాగే పాట ప్రోమో ను విడుదల చేసింది. అలాగే ఈ ఫుల్ సాంగ్ మే 1 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa