అల్లరి మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి అల్లరి నరేష్ మొదటి సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది . ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది . ఇక దానితో వరుసగా నరేష్ కామెడీ ఓరియంటెడ్ సినిమాలలోని నటిస్తూ తన కెరియర్ ముందుకు సాగించాడు. అందులో భాగంగా ఈయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో చాలా సంవత్సరాలు ఈయన కేవలం కామెడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. 

అలాంటి సమయంలో ఈయన మధ్యలో ఒకటి , రెండు వైవిద్యమైన సినిమాలలో నటించినప్పటికీ ఎక్కువ ప్రాముఖ్యతను మాత్రం ఈయన కామెడీ సినిమాలకే ఇస్తూ వచ్చాడు. కానీ సుడిగాడు మూవీ తర్వాత ఈయనకు వరస అపజయాలు రావడంతో ఈయన రూట్ మార్చాడు. కామెడీ సినిమాలపై కాకుండా డిఫరెంట్ మోవీ లపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందులో ఈయన బాగానే సక్సెస్ అయ్యాడు. ఇకపోతే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈయన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

తాజాగా నరేష్ "ఆ ఒకటి అడక్కు" అనే కామెడీ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాలోని "హమ్మమ్మో" అంటూ సాగే పాటను ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఆ ఒక్కటి అడక్కు మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

An