దర్శకుడు వెంకట్ ప్రభూ సినిమా అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు సాంకేతిక విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు దర్శకుడు. సినిమాలో కూడా ఇవే కనిపిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే   విజయ్ నటిస్తున్న లాస్ట్ సినిమా గోట్. ఇక ఈ సినిమా తర్వాత తన 69వ సినిమా చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారు అన్న వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అయితే వెంకట్రావు దర్శకత్వం వహిస్తున్న

ఈ సినిమాని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి స్నేహ లైలా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రశాంత్ ప్రభుదేవా వైభవ్ ప్రేమ్ జి మోహన్ వంటి వారు చాలామంది కీలకపాత్రల చేస్తున్నారు. శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది. కాగా విజయ నటిస్తున్న గోట్ సినిమాని సెప్టెంబర్ 5న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి.

కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్‌ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్‌ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్‌ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: