నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఫిమేల్ లీడ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా శబరి. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్సినిమా గురించి మాట్లాడుతూ.. పలు సంచలన విషయాలను వెల్లడించింది.

దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ఈ సినిమాకి సంబంధించిన కథను విని కచ్చితంగా ఈ సినిమా చేస్తాను అని ఒప్పుకున్నాను.. కానీ షూటింగ్ స్టార్ట్ చేయడం మాత్రం కొంచెం ఆలస్యమైంది.. ఇకపోతే ఈ సినిమా ఒక సైకలాజికల్ ఇందులో నేను తల్లి పాత్ర పోషించాను భర్తతో సమస్యల కారణంగా అతని నుండి వేరుగా ఉంటూ కుమార్తెను ఒంటరిగా పెంచే ఒక తల్లి పాత్ర నాది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. ఓ సమస్య నుంచి కూతురిని కాపాడుకోవడానికి తల్లి పడే తపన అందరికీ నచ్చుతుంది.  మదర్ అండ్ డాటర్ కనెక్షన్ హైలైట్ అవుతుంది. స్క్రీన్‌ప్లే డ్రివెన్ సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను ఇస్తుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. కొత్త దర్శక నిర్మాతలతో సినిమా చేయడం కొందరు రిస్క్ అంటున్నారు. కానీ నేను లైఫే రిస్క్ అంటాను. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాగే హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. ఈ సినిమా విషయంలోనూ అంతే. మేం ఒక డిఫరెంట్‌ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ జెన్యూన్ పర్సన్. ఆయనతో మరో సినిమా చేయడానికి కూడా నేను రెడీ అంటూ శబరి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మి శరత్ కుమార్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: