ఏదో ఒక కష్టం చేసుకుంటూ బతుకును ఎంతో భారంగా నడిపించే వాళ్లనే కూలి అని అంటారు. అంతేకాదు ఈ కూలీలు ఏలాంటి పని చేయడానికి అయినా సిద్ధమవుతారు. అంతేకాదు డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేసే వారిని కూలి అని అంటారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కూలి అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా పేరే వినపడుతోంది. సినీ ఇండస్ట్రీలో కూలి అనే టైటిల్ తో సినిమా వస్తే కచ్చితంగా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇప్పటికే హిందీలో అమితాబచ్చన్ ఇదే

పేరుతో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన కూలి నెంబర్ వన్ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. దాంతోపాటు తమిళంలో కూడా నటుడు శరత్ కుమార్ కూలీ పేరుతో ఒక సినిమా చేశాడు. అయితే తాజాగా ఇప్పుడు ఇదే టైటిల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం సినిమా చేయబోతున్నాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171 సినిమాకి కూలి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్ సంస్థాన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న

ఈ సినిమాలో నటి శోభన రజనీకాంత్ కి జోడిగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మరొక కీలక పాత్రలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సైతం నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా రజనీకాంత్‌ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్‌లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్‌ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్‌ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్‌లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: