ఈ మధ్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీ లో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన గిల్లి సినిమా రీ రిలీజ్ అయింది. ఏప్రిల్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ అయిన గిల్లి మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లను జనాల నుండి తెచ్చుకుంది.

ఇకపోతే తాజాగా మరో కోలీవుడ్ స్టార్ హీరో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కూడా రీ రిలీజ్ కి రెడీ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కొన్ని సంవత్సరాల క్రితం బిల్లా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అజిత్ మాఫియా డాన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇలా ఆ టైం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. బిల్లా మూవీ ని మే 1 వ తేదీన తమిళ నాడు రాష్ట్రంలో దాదాపు 150 ప్లస్ స్క్రీన్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే గిల్లి మూవీ తమిళ నాడు లో రికార్డులు సృష్టిస్తుంది. మరి ఆ రికార్డు లను అజిత్ నటించిన బిల్లా మూవీ చెరిపేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: