కొన్ని రోజుల క్రితమే హనుమాన్ అని మూవీ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారి గా ప్రశాంత్ వర్మ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది . దానితో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈయన దర్శకత్వంలో నటించడాని కి ఆసక్తిని చూపిస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే ప్రశాంత్ వర్మ కూడా ఓ బాలీవుడ్ హీరో తో మూవీ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ హీరో గా ప్రశాంత్ వర్మ తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ప్రశాంత్ వర్మ , రన్వీర్ సింగ్ కి ఓ కథను వినిపించగా , అది బాగా నచ్చడంతో వెంటనే ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి రన్వీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ ఇప్పటికే జై హనుమాన్ అనే మూవీ ని చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే రణ్వీర్ సింగ్ తో సినిమా పూర్తి అయిన తర్వాతే జై హనుమాన్ మూవీ సేట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే ప్రశాంత్ వర్మ క్రేజ్ రన్వీర్ సింగ్ మూవీ తో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pv