టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపుగా 20 ఏళ్లకు పైగా  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. అయితే తాజాగా తమన్నా చిక్కుల్లో పడింది అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమన్న కి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ ప్లే యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు

 తమన్నా ను ఈనెల 29న విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమన్న చేసిన ఈ పనికి కోట్లాది రూపాయల్లో నష్టం జరిగింది అని ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వయాకామ్ ఫిర్యాదుపై మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్‌ప్లే యాప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి భాటియాను విచారించడానికి సమన్లు పంపింది. తమన్నా భాటియా ఫెయిర్‌ప్లేను ప్రమోట్ చేసిందని, అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని

వర్గాలు తెలిపాయి.  మరోవైపు ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్‌కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా.. గైర్హాజరయ్యారు. ఆ రోజు తాను ముంబైలో లేడని పేర్కొన్నారు. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరాడు. ఫెయిర్‌ప్లే టాటా ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023ని చట్టవిరుద్ధంగా ప్రదర్శించిందని, ఈ కారణంగా తమకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లిందని వయాకామ్ తన ఫిర్యాదులో పేర్కొంది. స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. ఈ కేసు విచారణలో ఫెయిర్‌ప్లే వివిధ కంపెనీల ఖాతాల నుంచి కళాకారులకు డబ్బులు ఇచ్చినట్లు పోలీసులకు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: