తెలుగు సినీ పరిశ్రమలో మంచి మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ కి దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ , హాని రోజు హీరోయిన్ లుగా నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్మూవీ లోక్విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

సినిమా విడుదల తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఈ దర్శకుడు రవితేజ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తన తదుపరి మూవీ ని అనౌన్స్ చేశాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. దానితో ఈ దర్శకుడు మరో హీరోని వెతుక్కునే పనిలో చాలా కాలం వృధా చేశాడు. ఆఖరుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సన్నీ డియోల్ హీరో గా ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

మూవీ ని కూడా మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు , ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ సంవత్సరం జూన్ నెల నుండి ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: