మళ్లీ రావా మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను పెట్టి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన ఆ తర్వాత నాని హీరో గా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా జెర్సీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇదే మూవీ ని ఆ తర్వాత జెర్సీ అనే టైటిల్ తోనే షాహిద్ కపూర్ హీరో గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హిందీ లో రూపొందించాడు. కాకపోతే ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించడంలో కాస్త డిసప్పాయింట్ చేసింది. ఇక హిందీ జెర్సీ పూర్తి కాగానే ఈయన రామ్ చరణ్ తో మూవీ ని అనౌన్స్ చేశాడు.

కాకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ మూవీ క్యాన్సిల్ అయింది. దానితో విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ మూవీ ఓకే అయిన తర్వాత విజయ్ "ది ఫ్యామిలీ స్టార్" మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో అంతలోపు గౌతమ్ "మ్యాజిక్" అనే ఓ చిన్న సినిమాను పూర్తి చేశాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే మ్యాజిక్ మూవీ కి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఇకపోతే మ్యాజిక్ మూవీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మూవీ ని జూలై నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గౌతమ్ , విజయ్ సినిమా షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇకపోతే మ్యాజిక్ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... విజయ్ , గౌతమ్ కాంబోలో రూపొందుతున్న మూవీవని కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: