యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో , ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమావనుండి గ్లిమ్స్ వీడియోను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా దానికి అనిరుద్ అదిరిపోయే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై మరింతగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాట అప్పుడు రాబోతుంది , ఇప్పుడు రాబోతుంది అని అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా మొదటి పాట విడుదల కాలేదు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యొక్క మొదటి పాటను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి పాటను కూడా అప్పుడు విడుదల చేయబోతున్నాం..? ఇప్పుడు విడుదల చేయబోతున్నాం అని చెప్పి చివరకు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అలా గేమ్ చేంజర్ మూవీ నే దేవర యూనిట్ కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: