టాలీవుడ్ రాపో స్టార్ రామ్ పోతినేని క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రామ్ పోతినేని గత కొంతకాలంగా ప్లాప్స్ తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్స్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ పోతినేని దర్శకుడు పూరి జగన్నాథ కాంబినేషన్లో  సినిమా చేస్తున్నాడు. అయితే 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమా సీక్వల్ గా రాబోతోంది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఇక ఈ సినిమా తరువాత అటు పూరి జగన్నాథ్ ఇటు రామ్ కి ఒక్క హిట్టు కూడా రాలేదు. దీంతో మళ్లీ ఇద్దరి హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అలా మళ్లీ హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో రాం పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు చార్మి కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ఇక ఈ సినిమా కోసం రామ్ పారితోషకం తీసుకోకుండా వర్క్ చేస్తున్నారట. రెమ్యూనరేషన్ కి బదులు షేర్ తీసుకుంటున్నారట. సినిమా రిలీజయ్యి లాభాలు వచ్చిన తరువాత.. వాటిలో షేర్ తీసుకుంటానని రామ్ చెప్పారట. ఇక ‘లైగర్’ దెబ్బతో ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పూరి కూడా రామ్ నిర్ణయం కొంచెం బెటర్ అనిపించడంతో.. ఆయన కూడా షేర్ లా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. కాగా ఈ సినిమా కోసం పూరి భారీగానే ఖర్చు చేస్తున్నారట. కేవలం ఒక్క క్లైమాక్స్ సన్నివేశం కోసమే దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేసారని చెబుతున్నారు.  కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: