ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారడంతో కెరీర్లో వెనుకబడిపోయింది. టాలెంట్ ఉన్న హీరోయిన్లు విజయశాంతి కూడా ఒకరు. కానీ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల సినిమాలకి దూరంగా ఉంది విజయశాంతి. అయితే ఇటీవల చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి విజయశాంతి ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.

అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని చురుకులు కూడా అంటించేవారట. అయితే సినిమాలో మహేష్ బాబుతో నటించిన విజయశాంతికి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో నటించే అవకాశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక విజయశాంతి మాత్రం ఈ సినిమాలో పాత్ర చేయడం కుదరదు అని ఈ పాత్రకి నో చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతికి మంచి పాత్ర ఇచ్చారు. కానీ విజయశాంతి మాత్రం ఊహించిన విధంగా ఈ సినిమాను చెయ్యను అని చెప్పేసింది.

  కలిసి నటించే అవకాశాన్ని విజయశాంతి వద్దు అని అన్నారు. మరి ఎందుకు విజయశాంతి చిరంజీవితో సినిమా చెయ్యను అన్నారు అన్న క్లారిటీ మాత్రం లేదు. ఒకవైపు విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు కానీ తన తదుపరి సినిమాల్లో తన పాత్రల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. గతంలో మంచి హీరోయిన్లుగా చలామణి అయిన సుమలత, బిగ్ బాస్ మాధవి వంటి వారు అడపాదడపా పాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ విజయశాంతి మాత్రం వారిలో ఒకళ్ళ లాగా వెళ్లడం లేదు. నిజానికి సరీలేరు నీకెవ్వరూ సినిమా సమయంలోనే ఈ సినిమా చేసి మళ్లీ వెనక్కి రాజకీయాల్లోకి వెళ్లిపోతానని విజయశాంతి స్పష్టంగా చెప్పారు. అందుకనే విశ్వంభర సినిమాకి కూడా రాములమ్మ నో చెప్పిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: