ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్కి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవడంతో  త్వరలోనే  పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం అన్ని భాషల సినీ లవర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ రాంపేజ్ ను మరొకసారి థియేటర్స్ లో చూసేందుకు అల్లు అర్జున్

 అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్ కి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పను అవసరం లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. ఇక మరో రెండు నెలల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

 అవుతున్నాయి. ఇప్పటికి ప్రమోషన్స్ పూర్తి కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతుంది. ఇలాంటి వేళ పుష్ప 2 షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2లో ఫహాద్ పాత్ర చాలా కీలకం.. అయితే ఇప్పుడు మిగిలిన షూటింగ్ లో ఎక్కువగా ఫహాద్ సీన్స్‌యే ఎక్కువ ఉన్నాయట. దీంతో తాజాగా ఫహాద్ పుష్ప 2 కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం.. అయితే ఈ సినిమా షూటింగ్ లో జూన్ 1 నుంచి జాయిన్ కానున్నట్లు సమాచారం.. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొని తన పార్ట్‌ను కంప్లీట్ చేయబోతున్నారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: