సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, స్టార్ల మధ్య సఖ్యత ఉండదు.. సత్సంబంధాలు ఉండవు అనే టాక్‌ వినిపిస్తుంది. దీనికి తోడు మీడియాలో వచ్చే వార్తలు..ఇలాంటి అనుమానాలను భారీగా పెంచుతాయి. దాంతో స్టార్‌ హీరోల అభిమానులు.. తన్నుకు చస్తుంటారు. శత్రు దేశాల ప్రజల మాదిరి గొడవలు పడుతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే.. దాదాపు అందరూ సెలబ్రిటీలు కలిసిమెలసే ఉంటారు. అవసరమైన వేళ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు హాజరవుతూ.. తామంతా ఒక్కటే అని.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చాటుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కోలీవుడ్‌ స్టార్‌ ధనష్‌.. మరో స్టార్‌ హీరో కార్తీకి భారీగా విరాళం ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఎందకంటే..ఈమధ్యకాలంలో ధనుష్‌కు సంబందించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ధనుష్‌. తన సహా నటుడు కార్తీకి ఏకంగా కోటి రూపాయల విరాళమిచ్చాడీ స్టార్ హీరో. ఎందుకంటే.. సినీ కళాకారుల కోసం. అవును, నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి గాను.. కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు ధనుష్. ఈ సందర్భంగా ఆయనకు నడిగర్ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ధనుష్ చాలా ఏళ్లుగా కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో స్టార్‌ నటుడుగా వెలుగొందుతున్నాడు.. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు.

ఇక సినిమాలతోనే కాక సామాజిక సేవ చేయడంలో.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా ముందుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు ధనుష్‌. సినిమా కళాకారులు కోసం ఏకంగా కోటి రూపాయల విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన చెక్ ను కార్తీకి అందించాడు. ప్రస్తుతం వీరిద్దరి కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ధనుష్ చేసిన పనిని అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొత్త భవనం నిర్మిస్తున్నారు. అందుకు విరాళాలు సేకరిస్తున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ నాజర్, కోశాధికారి కార్తీలకు ధనుష్ రూ.కోటి చెక్ అందించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్‌ అవుతుంది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ధనుష్‌ చెక్‌ అందిస్తోన్న ఫొటోని సోషల్ మీడియాలో లో షేర్‌ చేశారు. గతంలో కమల్ హాసన్, దళపతి విజయ్ కూడా కళాకారుల సంఘానికి కోటి రూపాయల విరాళం అందించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియాలో కమల్ హాసన్, దళపతి విజయ్ లకు ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది సెలబ్రిటీలు తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్'చిత్రం గతేడాది రిలీజ్‌ అయ్యింది. కానీ యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన 'కుబేర' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: