బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పటికే అనేక సార్లు తన పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక మరోసారి ఈ బ్యూటీ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జాన్వీ తాజాగా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో జాహ్న వరుసగా ఈ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటుంది.

సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఈమె తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ ... తన కలలని అతడి కలలుగా భావించే వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అలాగే నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చేవాడు అయి ఉండాలి. అలాగే నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. నేను బాధలో ఉన్నా కూడా ధైర్యం చెప్పాలి. అన్ని విషయాలలో నాకు అండగా నిలిచే వాడినే పెళ్లి చేసుకుంటాను. ఇలా పై చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్న అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను జాన్వి తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

ఈమె ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగం ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమె టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ హీరోగా ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో మూవీ లో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: