విజయ్ దేవరకొండ లినప్ ప్రస్తుతం అదిరిపోయే స్థాయిలో ఉంది. ఈయన గీత గోవిందం సినిమా తర్వాత నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా కొంత కాలం క్రితం భారీ అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ మూవీ ఈయనకు భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖుషి సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. విజయ్ కొన్ని రోజుల క్రితమే ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇలా వరస ఫ్లాప్ లు రావడంతో ఈ నటుడు కచ్చితంగా సూపర్ సాలిడ్ విజయాలను అందుకోవాలి అనే ఉద్దేశంతో అదిరిపోయే రేంజ్ సినిమాలను సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ఓ మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూవీ కోసం రవి కిరణ్ కోలా ప్రీ ప్రొడక్షన్ పనులను బిజీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో విజయ్ సరసన ఓ బ్యూటీని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నీ హీరోయిన్ గా అనుకుంటున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈమెను సంప్రదించి స్టోరీ మొత్తాన్ని వివరించనున్నట్లు , ఈమెకు కనుక కథ నచ్చి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాలో విజయ్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd