రామ్ పోతినేని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న తర్వాత రామ్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ లభించలేదు. అంతేకాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కలిసి అభిమానుల ముందుకు తెచ్చిన లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఇప్పుడు అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కావాలి. దానికోసమే రామ్ పోతినేని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో  బ్లాక్ బస్టర్

 సినిమా   ను మరోసారి చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ డబుల్ ఇస్మార్ట్  సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇక విషయానికి వస్తే  రామ్ బర్త్డే సందర్భంగా రామ్ ఫ్యాన్స్ కు మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ

 సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అభిమానులు ఎంతగానో  ఆకట్టుకుంటుంది. మరోసారి పూరి దిమాక్ కిరికిరి అంటూ తన మార్క్ డైలాగ్స్ తో ఈ టీజర్  o రేంజ్ లో ఉంది. మరోసారి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేశాడు. కాగా ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: