ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ను ఆగస్టు 15నవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్,టీజర్,సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తను చేసిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మేరకు ఆ ఇంటర్వూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్   

 మాట్లాడుతూ.." సుకుమార్సినిమా కథను చెబుతూ స్మగ్లర్ పాత్ర అనగానే నేను కంగారు పడలేదు. ప్రేక్షకుల ఆలోచన విధానం మారింది. ఒక సినిమాను సినిమాలాగే చూస్తారని భావించాను. అయినప్పటికీ ఈ కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఎందుకనో నేను పోషించే పాత్ర ప్రేక్షకులపై అంతగా ఎలాంటి ప్రభావం చూపించదు అని ఆలోచించాకే ఈ సినిమా చేయడం జరిగింది అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్    చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు ఛాలెంజ్ పాత్రలు చేయాలని ఉంటుంది" అని

 తెలిపారు. కానీ తాను పుష్ప వంటి ఛాలెంజ్ క్యారెక్టర్ సినిమా ఇప్పటివరకు అసలు చేయలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఇక '' పుష్ప నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'పుష్ప పుష్ప' సాంగ్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో రికార్డు న్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ కూడా త్వరలోనే అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: