1996లో శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. ఈ సినిమాకి 20ఏళ్ల తర్వాత మళ్లీ సీక్వెల్ ప్రకటించారు. అయితే ఈ సినిమా 2019లోనే షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా ఒక భాగంగా షూటింగ్ మొదలు పెట్టుకున్నా.. ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ పై ఉదయనిది స్టాలిన్ సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో

 నిర్మిస్తున్నారు. కాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల డిలే అవుతూ వస్తోంది. అయితే మళ్ళీ ఇప్పుడు మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అయింది .విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. కాగా కమలహాసన్ నటించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింమ్స్ వీడియో సినిమాపై

 అంచనాలను తారా స్థాయికి తీసుకువెళ్ళింది.  ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. వారితోపాటు సిద్ధార్థ్ ప్రియా భవాని శంకర్ ఎస్ జె సూర్య బాబి సింహ వంటి వారందరూ కొన్ని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఇండియన్ టు సినిమాతో పాటు ఇండియన్ త్రీ కి కూడా షూటింగ్ ఒకేసారి జరిపినట్లుగా ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే మొదట ఇండియన్ 2 సినిమాని మేకర్స్ జూలైలో విడుదల చేస్తాము అని  ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని అన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: