బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో సోనాక్షి సిన్హా ఒకరు. ఇకపోతే తాజాగా ఈమె హిరామండి అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా నెగటివ్ షేడ్స్ ఉన్న వేశ్య పాత్రలో నటించింది. ఇక ఈ వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

అలాగే ఇందులో సోనాక్షి సిన్హా నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ వెబ్ సిరీస్ తోనే ఇటు సోనాక్షి సిన్హా , అటు సంజయ్ లీలా భన్సాలీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా సోనాక్షి సిన్హా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా కెరియర్ తొలి నాళ్లలో తను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సోనాక్షి మాట్లాడుతూ ... నేను కెరియర్ లో ఎప్పుడూ ఆఫర్ల గురించి పెద్దగా కష్టపడలేదు. నాకు కెరియర్ ప్రారంభించిన సమయంలో మంచి సినిమా అవకాశాలే వచ్చాయి.

కాకపోతే ఆ సినిమాల ద్వారా నాకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక నేను ఎన్నో కమర్షియల్ సినిమాలలో ఇప్పటి వరకు నటించాను. నేను కమర్షియల్ సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. ఇక సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవచ్చు... కానీ అందులో నా నటన కోసం నేను ఎంత చేయాలో అంత చేస్తాను. నా పాత్ర డిమాండ్ చేస్తే దాని కోసం ఏది చేయడానికే అయినా నేను రెడీగా ఉంటాను. అలాగే సినిమా కోసం ఎంత కష్టపడడానికి అయినా రెడీగా ఉంటాను అని సోనాక్షి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: