తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఆనంద్ దేవరకొండ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం పుష్పక విమానం అనే కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2021 వ సంవత్సరం నవంబర్ 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ మూవీ చాలా తక్కువ కాలంలోనే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వెంటనే ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అవుతుంది అని చాలా మంది జనాలు అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై ప్రసారం కాలేదు. దానితో జనాలు కూడా ఇప్పట్లో ఈ సినిమా బుల్లి తెరపై ప్రచారం అయ్యే అవకాశం లేదు అని లైట్ తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు ఇంత కాలం తర్వాత ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ ఛానల్ వారు ఈ సినిమాను ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. దామోదర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... గీత్ సైనీ , శాన్వి మేఘన , సునీల్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ మూవీ తర్వాత ఆనంద్ "బేబీ" అనే మూవీ లో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad