మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కావడానికి రెడీగా ఉంది. దానితో ఈమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా అనేక టీవీ షో లలో , ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఈటీవీ లో ప్రసారం అయిన ఆలీతో సరదాగా అనే షో కు ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ షో లో భాగంగా ఈమె అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరి కోసం చేశాను అనే విషయాన్ని క్లియర్ గా చెప్పింది. తాజాగా కాజల్ మాట్లాడుతూ ... నేను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ లో ఐటెం సాంగ్ చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఆ ఐటమ్ సాంగ్ మి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇకపోతే ఆ ఐటమ్ సాంగ్ నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం చేశాను. ఆయనతో నేను జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కంటే ముందు చాలా సినిమాలలో నటించాను.

మేమిద్దరం మంచి స్నేహితులం. అందుకే ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేశాను. ఆ సాంగ్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసాం అని ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బృందావనం మరియు బాద్షా మూవీ లలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లలో బృందావనం మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ... బాద్షా మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కానీ ఈ రెండు సినిమాల్లో వీరి జంటకు మాత్రం మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: