తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తన సినిమాలతో తన లుక్స్ తో ట్రోల్ అయినా తన అభిమానులని సంతృప్తి పరచడంలో మాత్రం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న స్టార్ హీరోస్ లో ఫ్యాన్స్ కి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది తలపతి విజయ్ మాత్రమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం విజయ్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ విషయంలో విజయ్ మిగతా స్టార్ హీరోల కంటే బెటర్. ఇంకా తన అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం తన పాత సినిమాలని కూడా రీ రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే గిల్లితో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన విజయ్ తన సచిన్ సినిమాతో కూడా ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉండగా విజయ్ తన తదుపరి చిత్రం G.O.A.T. ని వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న చాలా గ్రాండ్ విడుదల కానుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మెగా-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు నిర్మాత అర్చన కల్పాతి ధృవీకరించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ వార్తను పంచుకున్నారు. ఈ సినిమాలోని VFX వర్క్స్ ని అమెరికాలో ఓ ఫేమస్ కంపెనీ చేస్తుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో విజయ్ సరసన  మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఓ పాట విడుదల అవ్వగా దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కానీ యూ ట్యూబ్ లో 50 మిలియన్ల పైగా వ్యూస్ రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: