పుష్ప దిరైజ్  సినిమాలోని చూపే బంగారమాయేనే శీవల్లీ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో బన్ని వేసిన స్టెప్ నెట్టింట హాట్ టాపిక్ అయింది.అయితే పుష్ప ది రూల్ సినిమా నుంచి కూడా అలాంటి మెలోడీ రిలీజ్ కానుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సాంగ్ చూపే బంగారమాయేనే సాంగ్ ను మించి ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.అతి త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజయ్యే అవకాశం ఉంది. సెకండ్ సింగిల్ గా మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 3 నెలల సమయం ఉంది. దర్శకుడు సుకుమార్ వరుస సక్సెస్ లతో జోరుమీదుండగా పుష్ప ది రూల్ సినిమా కూడా భారీ స్థాయిలోని సుకుమార్ మార్క్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ తో ఉండబోతుందని తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ సింగిల్ హిట్ అయినా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

 పుష్ప సెకండ్ సింగిల్ అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ఈ మధ్య కాలంలో క్రేజ్ తగ్గిన సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సక్సెస్ సాధిస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 400 కోట్ల రూపాయల అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతోంది.పుష్ప ది రూల్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ లో కల్కి, పుష్ప ది రూల్ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా తన కెరీర్ లో స్పెషల్ మూవీ అవుతుందని బన్నీ భావిస్తున్నట్టు భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: