ఏ సిని ఇండస్ట్రీలోనైనా సరే హీరోయిన్గా రాణించడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ వస్తే చాలు మళ్ళీ ఆ ట్యాగ్ ఎప్పుడు పోతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సినిమాలు చేసే హీరోయిన్లు ఇప్పుడున్న టాలీవుడ్ ని ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కొంతమంది అవకాశాలని బాగా వినియోగించుకుంటూ ఉంటారు. అలా వినియోగించుకున్న చాలా మంది హీరోయిన్స్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సంపాదించుకున్నారు. అయితే అలాంటి వాళ్ళు  ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పొచ్చు. ఇక అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ముందు వరుసలో ఉంటుంది అని

 చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వికపూర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కానుంది .అయితే ఈ సినిమా విడుదల కూడా కాకముందే బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయింది ఈ బ్యూటీ. అయితే జాన్వి కపూర్ చేసిన ఒక్క సినిమా కూడా ఇంకా టాలీవుడ్ లో విడుదల కాలేదు. అయినప్పటికీ తెలుగులో

 ఈమెక్రీజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే తనకి ఆఫర్లు కూడా భారీగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ క్రీస్ చూసిన స్టార్ హీరోయిన్స్ అయిన రష్మిక మందన శ్రీ లీలా పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ అందరు కూడా భయపడుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్లకి వచ్చే సినిమా అవకాశాలు కూడా జాన్వి కపూర్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం జాన్వి కపూర్ వాళ్లకి పక్కన పెడుతూ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈమె చేసిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది అంటే ఆ సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకుంటే ఈ ముద్దుగుమ్మ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: