ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను మొత్తం పూర్తి చేశారు చిత్ర బృందం. కాగా అప్పట్లో పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు పుష్పా 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.  ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం  వైరల్ అవుతుంది.

 అయితే దాదాపుగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది కానీ కొన్ని సీన్లు మాత్రం ఇంకా షూటింగ్ చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. తర్వాత సినిమా ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేయాలి అని సుకుమార్ అన్ని విధాలుగా ఆ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దానికోసమే కష్టపడుతున్నారట. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా. వినబడుతోంది. అదేంటంటే పుష్పటు సినిమా నుండి ఎడిటర్ ఆంటోనీ రూబిన్

 తప్పుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగవైనల్ అవుతోంది ఆయన పుష్పా సినిమాకి ఎడిటర్ గా చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో ఆయన తప్పుకోవడం పై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి బదులుగా ఇప్పుడు నవీన్ పుష్ప సినిమాకి ఎడిటర్ గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇంతకుముందు నవీన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి ఎడిటర్ గా చేశారు. చివరి నిమిషంలో ఆయన సినిమా నుండి తప్పుకోవడం ఎవరికీ నచ్చలేదు. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు అనసూయ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి: