కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా టాక్సిక్. యాక్టర్ కం డైరెక్టర్ గీతం మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యష్ కెరియర్ లో 19వ సినిమాగా రాబోతోంది.  కాగా యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కెవిఎన్ ప్రొడక్షన్ పై వెంకట్ కే నారాయణ గారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు కనిపిస్తారు అన్నదానిపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది.  తాజాగా అందుతున్న

 సమాచారం ప్రకారం కన్నడ స్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీయర అద్వానీ హీరోయిన్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెతోపాటు లేడీ పవర్ స్టార్ నయనతార సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్లో తెగ వినబడుతోంది. అయితే మరొక వార్త ఏంటంటే.. నయనతార ఇందులో యష్ కి సోదరి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార హీరోయిన్గా పలు సినిమాలు చేస్తూనే ఇప్పుడు ఈ

 సినిమాలో సోదరి పాత్ర చేయడానికి ఒప్పుకుంది. ఇక లీడింగ్ హీరోయిన్లుగా కీయార అద్వానీ నయనతార కేజీఎఫ్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని ఈ వార్త తెలిసిన వారి అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అద్వానీ కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమా 1970 గోవా కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బెంగళూరులో వేసిన భారీ సెట్స్ లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేయగా కొంత భాగం శ్రీలంకలో చేయాలి అని చిత్ర బృందం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక కే జి ఎఫ్ టు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి కేజిఎఫ్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ఎస్ ఇప్పుడు ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటున్నాడో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: