టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ , బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో త్రిష తో పాటు మరో సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు చెపుతున్నారు.సినిమా సెకండ్ హాఫ్ లో కనిపించే ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకోవాలి డైరెక్టర్ భావించారట. సినిమాకే హైలైట్గా నిలవనున్న ఈ పాత్ర కోసం వశిష్ట ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి , అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ బాగా నచ్చడం వల్ల ఆమె దానికి ఓకే చెప్పేశారనీ తెలుస్తోంది. త్వరలోనే ఈమె సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్లు వినికిడి. అలాగే ఈ మూవీ లో ‘హిట్లర్’ సినిమాలో లాగా చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారని, వారి చుట్టూ తిరిగే కథే ఇదని సినీ వర్గాలు అంటున్నారు.

మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఎమ్ఎమ్ కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.అది ఏంటి అంటే చిరంజీవికి ఈ సినిమాలో ముగ్గురు సిస్టర్స్ ఉంటారట. ఇక సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా సాగనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే మెయిన్ స్టోరీ అది అయి ఉండకపోయిన కూడా సబ్ ప్లాట్ కింద సిస్టర్ సెంటిమెంట్ అనే పాయింట్ ను రైజ్ చేసి దాని ద్వారా ఎమోషన్ ని వర్కౌట్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా దర్శకుడు అయిన వశిష్ట ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?ఇంతకుముందు చిరంజీవి హిట్లర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ గా మారింది. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమా కూడా ఆయనకు ఎంత వరకు సక్సెస్ ని సాధించి పెడుతుంది అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ కోసం మరోసారి సిస్టర్ సెంటిమెంట్ నే వాడుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…

మరింత సమాచారం తెలుసుకోండి: