టాలీవుడ్ యువ నటుడు అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ నటుడు ఆర్య హీరో గా రూపొందిన టెడ్డి సినిమాకి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. శాన్ అంటోన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి చాలా రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా అది బాగుండడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో విడుదల అయిన తర్వాత ఈ చిత్ర బృందం వారు సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తూ ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు బయటకు రాలేదు.

ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఆ పిల్ల కనులేతో అని సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల తో మళ్లీ ఈ సినిమాపై వార్తలు మొదలు అయ్యాయి. ఇకపోతే చిత్రీకరణ దశలో ఉండగానే ఈ మూవీ యొక్క ఓ టీ టీ పార్ట్నర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల ధియేటర్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టీ  టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న శిరీష్ ఆ మూవీ తర్వాత పలు సినిమాలలో నటించిన వాటి ద్వారా పెద్ద విజయాలను అందుకోలేదు. ఆఖరుగా ఈయన ఊర్వశివో రాక్షసివో సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: